Breaking News

పెద్ద బ్యానర్ చేతిలో ‘వార్-2’ హక్కులు

1 0

‘దేవర’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న మూవీ ‘వార్-2’. వాస్తవానికి ఇది బాలీవుడ్ మూవీ. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో వార్-2 మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచింది. యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా రూపొందుతుండటంతో థియేటర్లు దద్దరిల్లుతాయని యంగ్ టైగర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. రూ.100 కోట్లు ఇవ్వాలని నిర్మాతలు కండీషన్ పెట్టగా దాదాపు 90 కోట్లకు బేరమాడి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సితార అధినేత నాగవంశీ ఇటీవల వరుసగా తారక్ సినిమాల హక్కులను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు వార్-2 కూడా ఆయన చేతికే వెళ్లడంతో తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.