పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి పార్ట్-1’ 2024లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఇది మూడో సినిమా మాత్రమే. అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలను తీసిన అతడు కల్కి మూవీతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అయితే నాగ్ అశ్విన్ తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం మార్చి 21న రీ రిలీజ్ కాబోతోంది. నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా నటించిన ఈ మూవీ ఫీల్ గుడ్ హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కల్కి-2పై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం కల్కి-2 ప్రిపరేషన్ నడుస్తోందని వెల్లడించాడు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశముందని తెలిపాడు. కల్కి-2లో ప్రభాస్ పాత్ర ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశాడు. మొదటి పార్టులో మహాభారతం, ఇతర కీలక పాత్రల సెటప్ చేశామని.. సెకండ్ పార్టులో ప్రభాస్ పోషిస్తున్న భైరవ, కర్ణ పాత్రల గురించే ఎక్కువ ఉంటుందని వివరించాడు.
