Breaking News

బంగారం ధర తగ్గదా?

1 0

దేశంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మండిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90వేలు దాటి పరుగులు పెడుతోంది. దీంతో బంగారం కొనాలంటే సామాన్యులు అల్లాడిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వధూవరుల కుటుంబీకులు ఎక్కువ ధర పెట్టి బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటుతుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పట్లో ధర తగ్గదా అని పలువురు చర్చించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ పోరు, ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా పసిడి ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలల కాలంలో 70 శాతం బంగారు ఆభరణాల అమ్మకాలు తగ్గాయని ఏపీ గోల్డ్ అండ్ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రావు తెలిపారు. త్వరలోనే ఔన్స్ బంగారం ధర 3వేల డాలర్ల నుంచి 3,040 డాలర్లకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.