సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రకెక్కింది. ఎవరూ ఊహించని విధంగా 150 కోట్లకు పైగా షేర్ సాధించి అందరితో వారెవ్వా అనిపించింది. థియేటర్లలో హిస్టరీ క్రియేట్ చేసిన ఈ మూవీ మరో రికార్డు సృష్టించడానికి రెడీ అవుతోంది. సాధారణంగా ఇటీవల అన్ని సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాతే టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలుత టీవీలో వచ్చిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది. ఈ సినిమా కామెడీ మూవీ కావడంతో శాటిలైట్‌లో మంచి రేటింగ్ సాధించే అవకాశం ఉందని సినీ పండితులు చర్చించుకుంటున్నారు.
