Breaking News

బిగ్‌బాస్-8 తెలుగుపై తీవ్ర విమర్శలు

1 0

బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడని.. నిఖిల్‌ను నాగార్జున విజేతగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఓటింగ్‌లో గౌతంకృష్ణకు 44 శాతం ఓట్లు రాగా.. నిఖిల్‌కు 30 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, గౌతంకృష్ణ ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతోనే నిఖిల్‌ను విజేతగా ప్రకటించినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు టైటిల్ గెలిచిన చరిత్ర లేదు. దీంతో నిఖిల్ విన్నర్ అవుతాడని చాలా మంది ఊహించారు. కానీ తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున గౌతంకు మద్దతుగా ఓట్ల వర్షం కురిపించారు. కానీ ఈ ఓట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి. అయితే విజేతగా నిలిచిన నిఖిల్‌పై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ సీజన్ గడుస్తున్నకొద్దీ కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్‌పై నెగిటివిటీ ఏర్పడింది. కానీ తను మాత్రం పెద్దగా కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా ప్రేక్షకులను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని గేమ్స్ ఆడుతూ అందరి మనసును గెలుచుకున్నాడని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.