అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా చాలా సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. ముఖ్యంగా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక మంచి సినిమా విడుదల అవుతోంది. టాలీవుడ్ నుంచి కిరణ్ అబ్బవరం ‘క’, కోలీవుడ్ నుంచి శివకార్తీకేయన్, సాయిపల్లవి నటించిన ‘అమరన్’, మల్లూవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’, శాండిల్ వుడ్ నుంచి ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీరా’ సినిమాలు దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్నాయి. అయితే సాధారణంగా దీపావళి అంటే అమావాస్య. అందుకే దీపాల పండుగకు సినిమాలు తక్కువగా రిలీజ్ అవుతాయి. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. దీపావళికి లాంగ్ వీకెండ్ రావడం కూడా ఈ సినిమాలకు ప్లస్ కానుంది. కానీ దీపావళి అమావాస్య సెంటిమెంట్ మాత్రం మన నిర్మాతలను వెంటాడుతూనే ఉంది. అందుకే మేకర్స్ సూపర్ ప్లాన్ వేశారు. దీపావళి అమావాస్య రోజున కాకుండా తమ సినిమాను ముందు రోజే ప్రీమియర్ వేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ప్రీమియర్స్‌లో సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తమ సినిమాకు ఢోకా ఉండదని వారు భావిస్తున్నారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’తో పాటు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘క’ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రీమియర్స్ వేయనున్నారు.