Breaking News

‘హరోం హర’ మూవీ ఓటీటీ అప్‌డేట్

1 0

సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘హరోం హర’ మూవీ జూన్ 14న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ఈటీవీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. గతంలో సుధీర్‌బాబు సినిమా ‘సమ్మోహనం’ హక్కులు కూడా ఈటీవీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి మంచి ఆదరణ దక్కడంతో మరోసారి సుధీర్‌బాబు మూవీని ఈటీవీనే కొనుగోలు చేసింది. జూలై మూడో వారంలో ఈటీవీ విన్ యాప్‌లో హరోం హర మూవీ స్ట్రీమింగ్ కానుంది. కుప్పం పరిసరాల్లో జరిగిన కథతో పీరియాడికల్ డ్రామాగా దర్శకుడు జ్ఞానసాగర్ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు తోడుగా మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సునీల్‌, అక్ష‌రా గౌడ ఇతర పాత్రల్లో కనిపించారు.