ఆర్టీవీ యజమాని రవిప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన టీవీ9 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్టీవీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అక్రమ మార్గంలో ఆర్టీవీ ఏర్పాటు చేసి నల్లధనంతో జీతాలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ED కేసులు నమోదు చేసినట్లు గతంలోనే వార్తలు వెలుగుచూశాయి. ఆఫ్రికాలో వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున డబ్బులు హవాలలో తరలించి అడ్డంగా బుక్ అయిన రవిప్రకాష్ ఇప్పుడు Rtv ఖర్చులను మొత్తం క్యాష్ రూపంలో ఖర్చు పెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కటంతో ఆర్టీవీ కార్యాలయంపై ED అధికారులు రైడ్ చేశారు. రవి ప్రకాష్ గత సంవత్సర కాలంగా Rtv ఎలా నడుపుతున్నారు. క్యాష్ రూపంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనే లెక్కలు బయటకు తీస్తే విస్తుబోయే నిజాలు బయటకు వచ్చాయి. Rtv కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్ సైతం బిల్లులు లేవు.. అన్ని నగదు చెల్లింపులు జరిగినట్లు ED అధికారులు గుర్తించారు. ఎంప్లాయిస్ జీతాలు సైతం క్యాష్ రూపంలోనే ఇస్తున్న విషయాలు అన్నిటినీ లెక్కలు బయటకు తీశారు. రెండు రోజులుగా గోప్యంగా విచారణ చేస్తు లెక్కలపై ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అసలు విషయం అంత బట్టబయలు కావటంతో రవిప్రకాష్ పరారీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆఫీసులోని ఏడున్నర కోట్ల నగదు ED అధికారులు సీజ్ చేశారని సమాచారం. మరోవైపు రవిప్రకాష్ సన్నిహితుడు చంద్రమౌళిని ED అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.