Breaking News

డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం

1 0

ఏపీలో మరికొన్నిరోజుల్లో ఎన్నికల సంగ్రామం జరగబోతోంది. అయితే పలు పథకాలకు ఇచ్చే డబ్బుల పంపిణీ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై కూటమి నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. డీబీటీ పథకాలను అడ్డుకుంటూ ఈసీ ఉత్తర్వులను ఇవ్వాళ్టి వరకూ నిలుపుదల చేస్తూ గతంలో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి. హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈసీని అధికారులు కోరారు. అయితే ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు చెప్తున్నారు.

ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరోవైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ చేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ చెప్తోంది. దీంతో టీడీపీ బాగోతం బయటపడిందని ప్రజలు భావిస్తున్నారు.