Breaking News

బ్యాంకుల వద్ద బారులు తీరిన అవ్వాతాతలు

0 0

ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చే పెన్షన్‌ల కోసం అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు ఉన్నప్పుడు గతంలో ఇంటికే పెన్షన్ వచ్చేదని.. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో అవ్వాతాతలు అవస్థలు పడుతున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వయస్సులో వారిని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా చంద్రబాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు మాత్రం జగన్‌కే అంటూ చెప్తున్నారు. చంద్రబాబు వల్ల 5km దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుందని అవ్వాతాతలు ఆవేదన చెందుతున్నారు.

NO PENSIONS.. NO SERVER
‘పొద్దున్న 7 గంటలకు బ్యాంకి వెళ్లి.. 11 గంటల వరకు Qలో నిలబడి ఉంటే.. 12 గంటలకు సర్వర్ పనిచేయుట లేదు అంటూ బోర్డు పెట్టారు.. ఇంత ఎండలో నిలబడి గంటలు వెయిట్ చేసినా ఫలితం లేదు మళ్ళీ రేపు రమ్మంటున్నారు.. రేపు అయిన ఇస్తారో లేదో.. దీనికి కారణం చంద్రబాబే’ అంటూ చంద్రబాబు, టీడీపీని తిడుతున్న అవ్వతాతలు.