రేటింగ్: 3.5/5
కమల్ కామరాజు, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా కాలకేయ ప్రభాకర్, పృథ్వీ ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్‌పై విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా ‘సోదర సోదరీమణులారా…’. ఈ మూవీకి రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సోదర సోదరీమణులారా’ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
రాజు (కమల్ కామరాజు), క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. భార్య శ్రావణి (అపర్ణాదేవి), కూతురు మహాలతో అతడు హ్యాపీగా గడుపుతుంటాడు.ఇటువంటి పరిస్థితుల్లో లేట్ నైట్‌లో సన్నీ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్ రాజును కిరాయికి రావాలని అడగడంతో ఊరి చివరన ఉన్న రిసార్టుకు బయలు దేరుతారు.అక్కడ జరిగిన కొన్ని పరిణామాలలో భాగంగా ఒక అమ్మాయిని తన క్యాబ్‌లో ఎక్కించుకుని తిరుగు ప్రయాణం అవుతాడు. దారిలో పోలీసులు చెక్ చేయగా క్యాబ్‌లో ఉన్న అమ్మాయి చనిపోయి ఉంటుంది. దీంతో రాజుపై రేప్ & మర్డర్ కేసును పోలీసులు నమోదు చేస్తారు. అయితే ఇంతకీ క్యాబ్‌లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? రాజుకు, ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి? పోలీసులు చెప్పిన ప్రకారంగా రాజే ఆ ఆమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడా? లేదా ఎవరైనా రాజును ఈ కేసులో ఇరికించారా? రాజు భార్య శ్రావణి తన భర్త నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘సోదర సోదరీమణులారా…’ సినిమా చూడాల్సిందే..
నటీనటుల పనితీరు
క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో అమాయకుడిగా కమల్ కామరాజు చక్కగా నటించాడు. రాజు భార్యగా నటించిన శ్రావణి (అపర్ణాదేవి) పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్‌గా ఉంది. తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది. సీఐ భాస్కర్ పాత్రలో బాహుబలి ప్రభాకర్ చక్కటి ప్రదర్శన చూపించాడు. అటు హోం మినిస్టర్‌గా సీనియర్ నటుడు పృథ్వీ నెగటివ్ షేడ్‌లో ఆకట్టుకున్నాడు. తన పాత్రతో అతడు ఈ సినిమాకు ప్రాణం పోశాడు.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఇటీవల టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు సోదర సోదరీమణులారా కూడా ఇలాంటి కోవకు చెందిన మూవీనే. ఒక రిసార్టుకు డ్రాప్ చేయడానికి వెళ్లిన క్యాబ్ డ్రైవర్ రాజు లైఫ్ ఎలా టర్న్ అయింది అనే రెగ్యులర్ స్టోరీని తీసుకుని ఇంట్రెస్టింగ్ కలిగించే ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ఎంచుకుని ఒక్క పాట కూడా లేకుండా ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతూ దర్శకుడు డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండా తెరకెక్కించాడు. ఆర్టిస్టుల రియాలిస్టిక్ పెర్ఫార్మన్స్తో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా ఈ మూవీని తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్‌గా మారుతుంది. వర్ధన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మైనస్. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకొంచెం పని చెప్తే బాగుండేది. మోహన్ చారి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్‌గా ఉన్నాయి.ఈ మూవీకి నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తెరకెక్కిన ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సోదర సోదరీమణులారా…’ ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోతుంది.