నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్‌టైన్‌మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. ఈ సినిమా టైటిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
ఆసక్తికరంగా కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. టైటిల్, పోస్టర్‌తోనే అందరూ తమను అన్వయించుకునే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందనే ఫీలింగ్ కలిగించింది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్లలో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి కెమెరామెన్‌గా, పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో కాలకేయ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ తారాగణం కనిపించనుంది.