Breaking News

OG Glimpse: అభిమానులకు గూస్‌బంప్స్.. జైలర్‌ మూవీని తలపిస్తోన్న పవన్ సినిమా

0 0

పవర్‌స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ అప్‌డేట్ వచ్చేసింది. సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘OG’ మూవీ గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘Hungry Cheetah’ పేరుతో విడుదలైన ఈ టీజర్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పదేళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాన్ గుర్తుందా అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా పవన్ ప్రత్యర్థులను ఊచకోత కోయడం ఇందులో కనిపిస్తుంది. అయితే అన్నింటికంటే హైలెట్ మ్యూజిక్ అనే చెప్పాలి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇటీవల వచ్చిన రజనీకాంత్ జైలర్‌ను తలపించడం ఖాయం. తమన్ కాపీ మాస్టర్ అని మరోసారి విమర్శలు వస్తుండగా.. పవన్ అభిమానులకు మాత్రం టీజర్ కన్నులపండగ అనే చెప్పవచ్చు. మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్‌లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సాహో తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం.