Breaking News

సెప్టెంబ‌ర్ నెల‌.. అన్నీ పెద్ద సినిమాలే

2 0

టాలీవుడ్‌లో ఒక్కో సీజ‌న్‌కు ఒక్కో ప్రాముఖ్య‌త ఉంటుంది. సంక్రాంతి, స‌మ్మ‌ర్, ద‌స‌రా, క్రిస్మ‌స్ సీజ‌న్‌లలో తెలుగు సినిమాల‌కు భారీగా డిమాండ్ ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది అనుకోకుండా సెప్టెంబ‌ర్ నెల‌లో అన్నీ భారీ సినిమాలే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముందుగా సెప్టెంబ‌ర్ 1న రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఖుషి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన నా రోజా నువ్వే సాంగ్ ఛార్ట్ బ‌స్ట‌ర్‌గా అన్నీ చోట్ల వినిపిస్తోంది. సెప్టెంబ‌ర్ 7న షారుఖ్ ఖాన్ న‌టించిన జ‌వాన్ మూవీ తెలుగులోనూ భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ 15న రామ్, బోయ‌పాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఈరోజే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అఖండ త‌ర్వాత బోయ‌పాటి నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అటు యంగ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తున్న‌ డీజే టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ మూవీ కూడా సెప్టెంబ‌ర్ 15నే విడుద‌ల కానుంది. ఒకవేళ వాయిదా ప‌డితే సెప్టెంబ‌ర్ 23కి షిఫ్ట్ కావొచ్చు. ఇక ఈ ఏడాది మోస్ట్ ఎవేటెడ్ మూవీ ప్ర‌భాస్ స‌లార్ సెప్టెంబ‌ర్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. కేజీఎఫ్ సిరీస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ కావ‌డం, పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ప్ర‌భాస్ అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. అలా ఈ ఐదు సినిమాలు సెప్టెంబ‌ర్‌లోనే విడుద‌ల కానుండ‌టం సినీ అభిమానుల‌కు క‌న్నుల పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు.