హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో ఏషియన్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ అత్యంత ప్రజాదరణ దక్కించుకుంది. ప్రముఖ స్టార్ హీరో మహేష్ బాబు ఏషియన్ గ్రూప్‌తో భాగస్వామ్యంగా ఏర్పడి గచ్చిబౌలిలో ఈ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఏషియన్ గ్రూప్‌తో జతకట్టి అమీర్ పేట ఏరియాలో సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాడు. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యింది. దీంతో దీని ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 15న అల్లు అర్జున్ చేతుల మీదుగా AAA మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఈనెల 16న విడుదలయ్యే ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో ఈ మల్టీప్లెక్స్‌లో సినిమా స్క్రీనింగ్ ప్రారంభం అవుతుంది. దీంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్ ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఏఎంబీని తలదన్నే విధంగా అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఉంటుందని.. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ఏషియన్ గ్రూప్ వర్గాలు చెప్తున్నాయి.
