Breaking News

నాగ‌చైత‌న్య‌ ‘క‌స్ట‌డీ’ ఓటీటీ డేట్ వ‌చ్చేసింది

1 0

నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించ‌బోతోంది. అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన క‌స్ట‌డీ సినిమాకు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో చైతూకు జోడీగా కృతి శెట్టి సంద‌డి చేసింది. వేస‌వి కానుక‌గా మే 12న విడుద‌లైన ఈ మూవీ తెలుగులో చెప్పుకోద‌గ్గ రీతిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అయితే ఇప్పుడు ఓటీటీ ప్రేక్ష‌కుల కోసం ఈనెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అఖిల్ ఏజెంట్ త‌ర్వాతే థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అఖిల్ మూవీకంటే ముందుగానే స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఏజెంట్ మూవీ ఈనెల 23 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.