Breaking News

విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘హంట్’

0 0

ప్రేమకథా చిత్రమ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో సుధీర్ బాబు. మహేష్ బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. సమ్మోహనం సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో వసూళ్లు ఆశాజనకంగా లేవు. ఈ మూవీ బాక్సాఫీస్ ఫలితాన్ని పక్కనపెడితే అప్పుడే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మేరకు ఈ సినిమాను ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. థియేటర్లలో అలరించని ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో సీనియర్ నటులు శ్రీకాంత్, కోలీవుడ్ యాక్టర్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ కీలక పాత్రలు పోషించారు.