ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకడు. ఈ షోలో తన టీమ్ పేరునే తన ఇంటి పేరుగా ఆర్పీ మార్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షో వల్ల క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల జబర్దస్త్ కార్యక్రమానికి కిర్రాక్ ఆర్పీ దూరమయ్యాడు. దీంతో రెస్టారెంట్ బిజినెస్‌ను అతడు ప్రారంభించాడు. హైదరాబాద్ నగరంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కొత్తగా కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. కిర్రాక్ ఆర్పీకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ కర్రీ పాయింట్‌కు ఉచిత ప్రచారం లభించింది. ప్రారంభం రోజు నుంచే జనాలు కర్రీస్ కోసం క్యూ కట్టారు. ఆర్పీ కర్రీ పాయింట్‌కు క్రమంగా కస్టమర్ల తాకిడి పెరగడంతో సమీపంలో ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది.
ఎక్కడైనా బిజినెస్ పెరిగితే ఎవరైనా ఆనందిస్తారు. కానీ కిర్రాక్ ఆర్పీ మాత్రం తన కర్రీ పాయింట్‌ను క్లోజ్ చేసుకున్నాడు. తన కర్రీ పాయింట్‌కు ఆదరణ పెరగడం, తాకిడి ఎక్కువ కావడంతో వారికి సరిపడ కర్రీస్‌ని సిబ్బంది ప్రీపేర్ చేయలేకపోతున్నారు. వంటకాలు తక్కువ, జనం ఎక్కువ కావడంతో సరైన సమయంలో పార్సెల్ చేయలేకపోతున్నారు. ఈ నిర్వాహణ కష్టంగా మారిన నేపథ్యంలో కర్రీ పాయింట్‌ను కిర్రాక్ ఆర్పీ క్లోజ్ చేశాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే అని.. త్వరలో కొన్ని మార్పులు చేసి త్వరలో రెస్టారెంట్‌ను ప్రారంభించాలని ఆర్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.