టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ మరణించి నెలరోజులు కూడా గడవకముందే మరో సీనియర్ నటుడిని కూడా టాలీవుడ్ కోల్పోయింది. టాలీవుడ్ యముడిగా పేరు పొందిన కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. 1959లో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా సత్యనారాయణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2009లో వచ్చిన అరుంధతి సినిమాలో చివరిసారిగా నటించారు.
కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌముడిగా పేరుగాంచారు. ఆయనకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.