Breaking News

మీరు స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా?

0 0

మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదికను టీవీ9 సిద్ధం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి.. స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శించాల్సిన ప్రదేశం టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పో.

60కి పైగా ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. ఆకర్షణీయమైన ఇంటీరియర్, ఫర్నీచర్. అద్భుతమైన హోం డెకొరేషన్ డిజైన్స్ కూడా వినియోగదారులకు అందించబోతోంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి రుణ సదుపాయం కల్పించే బ్యాంకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

అన్ని తరగతుల వారి బడ్జెట్‌కు తగిన స్థిరాస్తి, ఉత్తమమైన ఇంటీరియర్ అందించడమే ధ్యేయంగా టీవీ9 ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నవంబర్ 18 నుండి 20, 2022 వరకు హాల్ నెం.1, హైటెక్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్‌లో టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పో సందర్శించండి. ప్రవేశం ఉచితం.