Breaking News

పోలీస్ పేరుతో దౌర్జన్యాలు.. చేసేవన్నీ అక్రమాలే..!!

10 0

కష్టపడే తత్వం ఉన్న పొగిరి కృష్ణ అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు ఎదిగాడు. అయితే చేతిలోకి అధికారం వచ్చాక గర్వం పెరిగింది. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలని భావించాడు. దొరికినకాడ దొరికినట్టుగా డబ్బులు గుంజాడు. అడ్డం తిరిగిన వారిపై అక్రమంగా కేసులు పెడతా అని బెదిరించాడు. విశాఖపట్నంలో రెండంతస్తుల ఇల్లు, కార్లు కొన్నాడు. అయితే తన అక్రమ సంపాదన గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతాడు అని భయంతో చాలా మందికి బయటకు రాలేదు. ఇలా ఒకటి కాదు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

దానికి తోడు రాజకీయ నాయకులకు చెంచాగిరి చేస్తుండడంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. అదే నాయకులు అండతో ఇటీవల డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం సంపాదించాడు. అయినప్పటికీ పోలీస్ అనే పేరు వాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. భీమిలిలో ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహించిన ఈ పోలీస్ అక్రమంగా మద్యం తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా తానే ఈ మద్యం అమ్మితే ఇబ్బందులు వస్తాయని తన అత్తగారి ఊర్లో బియ్యంతో కలిపి మద్యాన్ని అమ్ముతూ అక్రమంగా సంపాదించాడట. ఈ విషయం చాలామందికి తెలిసినప్పటికీ పోలీస్ అనే పేరు చెప్పి భయపెడుతుండటంతో ఎవరూ నోరు విప్పట్లేదు.

ఎక్సైజ్ సీఐగా ఉన్న ఈ పొగిరి పోలీస్… ఎన్నో కబ్జాలకు కూడా పాల్పడ్డాడు. అయితే తన అధికారాన్ని ఉపయోగించి ఓ వైపు కబ్జాలు చేస్తూ డబ్బులు సంపాదించడమే కాకుండా ఎంతోమంది పేద వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తన కింద ఉన్న పోలీసులను తన తోటి పోలీసులను అందరినీ తన కంట్రోల్ లో పెట్టుకుని విర్ర వీగుతున్నాడు.

ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా పోలాకి పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో జరిగిన ఓ ఇష్యూ చూసుకుంటే సివిల్ మేటర్ విషయంలో తన అధికారాన్ని ఉపయోగించి ఇద్దరు కూలి పనులు చేసుకునే వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆ రైతుకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. ఇంకో కొడుకు వైజాగ్ లో చదువుతున్నాడు. అయితే మన రౌడీ పోలీస్ కు వీరు బంధువులే. కానీ అధికార గర్వంతో గత పది సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏదో ఒక విషయంపై ఆ రైతును తిప్పుతున్నాడు. బావ ఆర్మీ, తోటి అల్లుడు గవర్నమెంట్ లెక్చరర్ ఇలా ఇలా ఒకరిని మించి ఒకరు ఆ ఇద్దరు వ్యక్తులపై కేసులు పెడుతున్నారు. అయితే రైతు వీరిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రౌడీ సీఐ పోలీసులను తన అధికారంతో మేనేజ్ చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న పోలాకి పోలీసులు కూడా ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. సివిల్ మేటర్ లో తాము ఇన్వాల్వ్ కాలేమంటూ చెబుతున్నారు. కానీ రౌడీ పోలీస్ మాత్రం వేరే విధంగా క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ రౌడీ సీఐ దెబ్బకు బాధితులు చావే శరణ్యమని అంటున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఈ రౌడీ పోలీస్ బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. ఇక ఇప్పుడు ఇంకెంత మంది ఆయన గారి చేతిలో బలి కాబోతున్నారో చూడాలంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

(గమనిక: ఈ వార్త సోషల్ మీడియా కథనం ప్రకారం ప్రచురింపబడింది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత దురుద్దేశాలు లేవు)