Breaking News

ఇల్లు కట్టుకున్న గంగవ్వ.. గృహప్రవేశం ఫోటోలు చూశారా?

1 0

యూట్యూబ్ సంచలనం, బిగ్‌బాస్ ఫేం గంగవ్వ ఎట్టకేలకు ఇల్లు కట్టుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో గంగవ్వ ఇల్లు కట్టుకోగా.. ఈరోజు (నవంబర్ 9) గృహప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ ఫేం అఖిల్, శివజ్యోతితో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు. గంగవ్వ కొత్తింటి నిర్మాణానికి రూ.20 లక్షల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో రెండు బెడ్రూంలు, ఓ హాల్, కిచెన్, పూజ గది, మూడు బాత్‌రూంలు ఉన్నాయి.

కాగా గంగవ్వ ఇటీవల నాగచైతన్య లవ్‌స్టోరీ సినిమాలో నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూవీలో చిరుకు అమ్మ పాత్రలో గంగవ్వ కనిపించనుంది. 16 ఏళ్ల క్రితం గంగవ్వ భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి గంగవ్వ తన బిడ్డలతో ఎన్నో కష్టాలు అనుభవించింది.