టాలీవుడ్‌కు పవన్ కళ్యాణ్ ఎలాగో.. శాండిల్‌వుడ్‌కు పునీత్ రాజ్‌కుమార్ అలాగన్న మాట. అయితే కన్నడ పవర్‌స్టార్ శుక్రవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందాడు. ఈ ఉదయం జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుకు గురైన అతడిని కుటుంబీకులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళ్లను దానం చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతుల కుమారుడే పునీత్. 1975లో మార్చి 17న జన్మించిన పునీత్… బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘బెట్టాడ హువా’ చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. హీరోగా 29 చిత్రాలు చేశారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా ‘అప్పు’ అని పిలుస్తారు. పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ సైతం కన్నడలో ప్రముఖ హీరో. ఆయన హీరోగా నటించిన ‘జై భజరంగీ’ (కన్నడలో భజరంగీ 2) నేడు విడుదలైంది.