Breaking News

చైతూ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిపేస్తున్న సమంత

2 0

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని నాలుగు వారాలు గడుస్తున్నా ఇంకా వారి టాపిక్కే సోషల్ మీడియాలో కథకథలుగా నడుస్తోంది. ఎందుకు వీరు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ కష్టకాలం నుంచి సమంత బయటకు రావడానికి తీర్థయాత్రలు చేస్తోంది. మరోవైపు నాగచైతన్యతో జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసి.. ముందుకు సాగాలని కోరుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో గతంలో పోస్ట్ చేసిన నాగచైతన్య ఫోటోలను డిలీట్ చేస్తోంది. వీరిద్దరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, పెట్ డాగ్స్‌తో ఉన్న ఫొటోలను కాకుండా.. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే సమంత మెల్లమెల్లగా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మిగతా ఫోటోలను కూడా డిలీట్ చేసి.. నాగచైతన్య ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తుందేమో చూడాలి.  ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఇటీవల రెండు కొత్త సినిమాలకు పచ్చజెండా ఊపింది.