Breaking News

రానా ‘అరణ్య’ మూవీ ఓటీటీ డేట్

1 0

దగ్గుబాటి రానా కీలకపాత్రలో నటించిన ‘అరణ్య’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో రాబోతోంది. మార్చి 26న విడుదలైన ఈ మూవీ ఆరునెలలు గడిచినా ఇప్పటివరకు ఓటీటీలో రాలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 15 నుంచి జీ5 వేదికగా ‘అరణ్య’ స్ట్రీమింగ్‌ కానుంది. ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ అటవీ నేపథ్యంలో తెరకెక్కింది. ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రలు పోషించారు. శాంతను సంగీతం అందించారు.

.