సమంత, నాగచైతన్య విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ సమంత నటించిన ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్ ప్రధాన కారణమని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు సమంత క్రిస్టియన్ అని.. ఆమె హిందూ దేవుళ్ల అవమానించిందని, దీనిపై అక్కినేని ఫ్యామిలీ గరంగరంగా ఉందని టాక్ నడుస్తోంది. అయితే ఈ అంశాలపై హీరోయిన్ మాధవీలత స్పందించింది. సమంత హిందూ దేవుళ్లపై తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదని మాధవీలత తెలిపింది. ఆమె తిరుపతి వెళ్లినప్పుడు కూడా మంగళసూత్రానికి నమస్కరించిందని గుర్తుచేసింది. మరోవైపు ఇటీవల వెబ్‌సిరీస్‌లో సమంత వేసుకున్న బట్టల కారణంగానే ఆమె దంపతులు విడిపోయారనే వాదన సరికాదని సూచించింది. తల్లి కావాలని సమంత కోరుకునేదని.. ఎందుకంటే ఆమెకు పుట్టే పిల్లలు 15 ఏళ్లకు వచ్చినప్పుడు తనకు శక్తి ఉండాలని.. వారితో కలిసి ఆడుకునేంత శక్తి తనకు ఉండాలని సమంత కోరుకునేదని తెలిపింది. కానీ తల్లి కాకుండా ఆమెను ఆపారని.. అది ఎవరో తనకు తెలుసని మాధవీలత చెప్పింది. పెళ్లయినా కూడా ఒక రోబోలా సమంత పనిచేసి డబ్బులు సంపాదించిందని పేర్కొంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తూ.. కుటుంబం నుంచి పాకెట్ మనీ తీసుకునేదని… ఈ దారుణాల కంటే సమంత విడిపోవడమే మంచిదని మాధవీలత అభిప్రాయపడింది.