Breaking News

బాలయ్య టాక్ షో వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి

0 0

ఓటీటీల్లో అల్లు వారి ‘ఆహా’ శరవేగంగా దూసుకుపోతోంది. అతి తక్కువ వ్యవధిలోనే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆహా అనిపించుకుంది. మరోవైపు పలు టాక్ షోలను కూడా ఆహా చేపట్టి విజయవంతం చేసింది. ఈ కోవలో మరో టాక్ షోకు ఆహా రంగం సిద్ధం చేస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకు హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఈ టాక్ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్నఅఖండ సినిమా షూటింగ్ పూర్తయింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 4న అఖండ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.