Breaking News

చైతూ-సమంత విడాకులకు కారణమైన ‘ఆమె’ ఎవరు?

3 0

నాగచైతన్య, సమంత దంపతులు వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టేసి తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించేశారు. అయితే వారిద్దరి మధ్య అసలు ఏమైందనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట మధ్య విభేదాలు రావడానికి కారణం ఎవరు అనే దానిపై స్ఫష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. శనివారం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘నేను బాధలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. చరిత్రను చూస్తే అర్థమవుతుంది చివరకు గెలిచేది ప్రేమ, సత్యం మాత్రమేనని. ఆ చరిత్రలో కనిపించకుండా కుట్రలు చేసే నియంతలు, హంతకులు ఉంటూనే ఉన్నారు. కానీ వారికి చివరికి పతనం తప్పదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి’ అంటూ సమంత ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి గురించి ఆరోపణలు చేసింది.

అయితే సమంత బెస్ట్ ఫ్రెండ్ అయిన జువాల్కర్ కూడా ఈరోజు ఓ పోస్ట్ పెట్టాడు. సమంతను అక్క అని పిలిచే జువాల్కర్.. ఆ అజ్ఞాత వ్యక్తి గురించి ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘కంగ్రాట్స్ slut, అతడు ఇక నీవాడే’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టాడు. దాని తర్వాత ‘అబద్దాలు, రహస్యాలు బంధాలని చంపేస్తాయి. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రోజు దొరికిపోతావ్’ అని పేర్కొన్నాడు. అయితే, ఈ కామెంట్లు సమంత-చైతూ జీవితంలోకి వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి గురించి చేసినవేనని మాత్రం స్పష్టమవుతుంది. ఇంతకీ చైతూ జీవితంలోకి ప్రవేశించిన ఆ అమ్మాయి ఎవరో తెలియాల్సి ఉంది.