Breaking News

బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

1 0

బిగ్‌బాస్-5 నాలుగో వీకెండ్‌కు వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగో వీకెండ్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో కూడా బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్‌లలో మొత్తం 8 మంది ఉన్నారు. వారిలో లోబో, సిరి, రవి, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, సన్నీ, ప్రియ, కాజల్ ఉన్నారు. అయితే శనివారం మొత్తం నలుగురు సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. సేవ్ అయిన నలుగురిలో రవి, ప్రియ, కాజల్, సన్నీ ఉన్నారు. ఇంకా నలుగురు ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఉన్నారు. వీరిలో నటరాజ్ మాస్టర్‌కు ఈ వారం ఓట్లు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్ చాలా అగ్రెసివ్‌గా ఉండటం, చాటుగా హౌస్‌మేట్లకు పేర్లు పెట్టడం ఆయనకు ఓట్లు తక్కువగా రావడానికి కారణాలు. అంతేకాక ఆయన భార్య గర్భవతి కావడం కూడా ఆయన ఎలిమినేషన్‌కు కారణమని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.