Breaking News

ఎట్టకేలకు చైతూతో విడాకులపై స్పందించిన సమంత

1 0

కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య, సమంత దంపతుల విడాకుల వార్తలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంతకు ఫ్యామిలీ మ్యాన్-2 అడ్డురాయిలా తగిలింది. ఆ వెబ్ సిరీస్‌తో సమంతకు మంచి పేరు వచ్చినా.. కుటుంబపరంగా సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే చైతూతో విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులతో సమంత చాట్ చేసింది. నన్ను ఏం అడగాలనుకుంటున్నారో రెడీ అవ్వండి అంటూ సమంత అవకాశమివ్వగా.. అభిమానులు చైతూతో విడాకుల వార్తల గురించి షురూ చేశారు. దీంతో ఓ అభిమాని మీరు ముంబై వెళ్లిపోతున్నారా? అంటూ అడిగాడు. దీనికి సమాధానంగా సమంత తాను ఎక్కడికి వెళ్లడం లేదని, హైదరాబాద్ తన ఇల్లు అని క్లారిటీ ఇచ్చింది. చైతూతో నేను విడిపోతున్నాననే పుకారు ఎక్కడ మొదలైందో నిజంగా తెలియదని ఎమోష‌న‌ల్ అయ్యింది. అదొక రూమర్ అని.. అందులో వాస్త‌వం లేద‌ని, ఎప్ప‌టికీ హైదరాబాదే తన ఇల్లు.. హైదరాబాద్ తనకు అన్నీ ఇస్తోంది, తాను ఇక్కడే ఉంటా అంటూ సమంత పేర్కొంది.