సరికొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లను అందిస్తున్న ఆహా ఓటీటీ మరో కొత్త సినిమాను ప్రేక్షకులకు అందించనుంది. సిద్ధార్థ్ నటించిన ‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమాను అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తెలిపింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఇందులో సిద్ధార్థ్‌కు బామ్మర్దిగా నటించాడు. బిచ్చగాడు ఫేం శశి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానరుపై రమేష్ పిళ్లై ఈ మూవీని నిర్మించాడు. కాగా ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు గతవారం ఆహా అందుబాటులోకి తెచ్చిన దుల్కార్ సల్మాన్ ‘పరిణయం’ మూవీ రొమాంటిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
