బిగ్‌బాస్-5 సీజన్ రెండో వారంలోనే బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చిన ఉమాదేవి సంచలన కామెంట్లు చేసింది. ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడని చెప్పింది. అతడే యాంకర్ రవి అని వెల్లడించింది. హౌస్‌లో ఏం జరుగుతుందో.. ఏం జరగబోతుందో అతడికి ముందే చెప్పి సెట్ చేశారని ఉమాదేవి ఆరోపించింది. ప్రోమోలు ఎలా కట్ చేస్తారు.. ఏది ఉంచుతారు.. ఏది ఎడిట్ చేస్తారు.. ఏ టైంలో ఏది ప్లే అవుతుంది.. ఇలా ప్రతి విషయం యాంకర్ రవికి బిగ్‌బాస్ నిర్వాహకులు చెప్పి పంపారని.. అందుకే అతడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, అతడే బిగ్‌బాస్ విన్నర్ అవుతాడని ఉమాదేవి పేర్కొంది.
మరోవైపు కంటెస్టెంట్ ప్రియాకు ఉమాదేవి సపోర్ట్ ఇచ్చింది. ఈ వారం నామినేషన్స్ సందర్భంగా ప్రియ మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించింది. ఆమె ఏం చూసిందో అదే చెప్పారని.. ప్రియా కాదు.. తాను కూడా చెప్తున్నానని.. ప్రతిదానికి రవి, లహరి హగ్ ఇచ్చుకుంటారని తెలిపింది. బిగ్‌బాస్ అంటే హగ్‌లు ఇచ్చుకోవడమేనా, ప్రతి దానికి హగ్ అవసరమేనా అని నిలదీసింది. అర్ధరాత్రి హగ్ ఇచ్చుకుంటే ఎవరైనా అడుగుతారని ఉమాదేవి పేర్కొంది. లహరి నిజంగా మగాళ్లకే హగ్‌లు ఇస్తుందని.. హౌస్‌లో ఉన్న ఆడవాళ్లకు ఆమె హగ్‌లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. ప్రతి విషయానికి ఫ్యామిలీ అని పాట పాడే యాంకర్ రవి.. ఫ్యామిలీ అంటే అంత ప్రేమ ఉంటే బిగ్‌బాస్ హౌస్‌కు ఎందుకు వచ్చాడని.. ఫ్యామిలీతో కలిసి టీవీలో చూస్తే సరిపోతుంది కదా అని ఉమాదేవి వ్యాఖ్యానించింది.