తెలంగాణలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. అయితే హైదరాబాద్ నగరం ఇప్పుడు రాష్ట్రంగా మారిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనే సాక్ష్యం అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానంగా టీఆర్ఎస్ భవన్‌తో పాటు సిటీలోని పలు చోట్ల భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలలో తెలంగాణ అనే పదానికి బదులు హైదరాబాద్‌ను రాష్ట్రం అంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రింట్ చేయించారు. దీంతో ఈ ఫ్లెక్సీలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.