Breaking News

నాగార్జున ట్వీట్‌కు దిగొచ్చిన సమంత

3 0

టాలీవుడ్‌లో ప్రస్తుతం నాగచైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. సమంత ఏం చేసినా అది క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. తాజాగా ఆమె అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన తనయుడు నాగార్జున ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 20 తనకు చాలా ప్రత్యేకమైన తేదీ అని, తన హీరో, తన ప్రేరణ నాన్న గారి పుట్టినరోజు అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన సమంత.. చాలా బాగుంది అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే నాగార్జునను ఏకవచనంతో పిలవడంతో నెట్టింట్లో మాములుగా రచ్చ జరగలేదు. అక్కినేని అభిమానులందరూ సమంతను తెగ ట్రోల్ చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన సమంత వెంటనే తన తప్పును సరిదిద్దుకుంది. వెంటనే ఇది చాలా బాగుంది మామ అంటూ క్షణాల్లోనే మరో ట్వీట్ చేసింది. పాత ట్వీట్‌ను డిలీట్ చేసింది. అయితే నెటిజన్‌ల డిమాండ్‌తో నాగ్‌ను సమంత మామ అని సంభోదించినట్లు స్ఫష్టమవుతుంది. మరి చైతూతో విడాకుల సంగతేంటో మాత్రం తెలియరాలేదు. మరికొద్దిరోజుల్లోనే ఈ అంశంపై స్ఫష్టత వచ్చే అవకాశముంది.