టీవీ రేటింగ్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు షోల గురించే మాట్లాడుకుంటున్నారు. గతంలో అంటే జబర్దస్త్ షో గురించి మాట్లాడుకునేవారు కానీ ప్రస్తుతం రియాల్టీ షోలు ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్‌బాస్ గురించి చర్చించుకుంటున్నారు. అయితే మాటీవీ, జెమినీ టీవీలలో ప్రసారమయ్యే ఈ రెండు షోలకు టైమ్ విషయంలో క్లాష్ లేకపోయినా రేటింగ్స్ విషయంలో మాత్రం క్లాష్ వస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు వారం వారం తన రేటింగును మెరుగుపరుచుకుంటోంది. తొలివారం ఈ షో 5.62 టీఆర్పీ నమోదు చేయగా.. రెండో వారం 6.48 టీఆర్పీని నమోదు చేసింది. ఇక మూడో వారం 7.30 టీఆర్పీని దక్కించుకుంది.
మరోవైపు బిగ్‌బాస్-5 మాత్రం ఆశించిన మేర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఈ షో గత ఐదు సీజన్‌లతో పోలిస్తే రెండో అత్యల్ప టీఆర్పీని నమోదు చేసింది. ఇప్పటివరకు గత సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీని నమోదు చేసిన రికార్డు పదిలంగా ఉంది. బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీలను గమనిస్తే.. తొలి సీజన్ (ఎన్టీఆర్) 16.18, రెండో సీజన్ (నాని) 15.05, మూడో సీజన్ (నాగార్జున) 17.9, నాలుగో సీజన్ (నాగార్జున) 18.5, ఐదో సీజన్ (నాగార్జున) 15.71 టీఆర్పీలు నమోదయ్యాయి.

GE