హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారనే అనిపిస్తోంది. ఆ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో జ్యుడిషియల్ కమిటీ వచ్చి ఎంక్వైరీ చేసింది. దీంతో ఈసారి తలనొప్పులు ఎందుకు అని పోలీసులు భావించారో.. ఏమో కానీ.. సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజును పోలీసులే చంపి రైలు పట్టాల కింద పడేశారని మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. 8 రోజులుగా 3వేల మంది పోలీసులకు 300 సీసీ కెమెరాలకు దొరకని వాడు.. సడెన్‌గా రైలు పట్టాలపైకి ఎలా వెళ్లాడన్న విషయం అంతుబట్టలేకుండా ఉంది. అందుకే ప్రజలందరూ ఎన్‌కౌంటర్ పాత ట్రెండ్ అని… ట్రైన్ కౌంటర్ కొత్త ట్రెండ్ అనే నినాదాన్ని సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు.