Breaking News

ఈనెల 17 నుంచి ఆహాలో కొత్త సినిమా

1 0

ఇప్పటికే పలు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో కొత్త సినిమాను అందుబాటులోకి తీసుకురానుంది. సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీని ఈనెల 17 నుంచి ఆహా స్ట్రీమింగ్ చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బైక్ కథాంశంతో ఈ మూవీని దర్శకుడు దర్శన్ తెరకెక్కించాడు. ఈ మూవీలో హీరో సుశాంత్ తల్లిగా ఐశ్వర్య, స్నేహితులుగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నిర్మాతల్లో ఒకరైన హరీశ్ కోయలగుండ్ల నటించారు. ఒకప్పటి హీరో వెంకట్ బావమరిదిగా అభినవ్ గోమటం నటించాడు. మరోవైపు ఈనెల 10 నుంచి హీరో సంతోష్ శోభన్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది బేకర్ & ది బ్యూటీ’ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఆహా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది.