నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సమంత తనదైన స్టైలులో స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై పరోక్షంగా హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా మీడియా, రియాలిటీ మధ్య వ్యత్యాసాన్ని చూపించింది. చైతూతో తాను బాగానే ఉన్నానని, కానీ మీడియానే దానిని పెద్దది చేసి చూపిస్తోంది అన్నట్లుగా సదరు పోస్టులో చెప్పకనే చెప్పింది. కాగా ఇటీవల నాగార్జున బర్త్ డే రోజు అక్కినేని ఫ్యామిలీ ఫోటోలలో సమంత కనపడలేదు. అయినా సమంత ట్విట్టర్ ద్వారా చాలా ప్రేమగా తన మామకు శుభాకాంక్షలు తెలిపింది. అయినా విడాకుల పుకార్లకు బ్రేక్ పడకపోవడంతో స్వయంగా సమంతే రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది.