ఫోటో అనేది ఎంతో మధురమైన జ్ఞాపకం లాంటిది. ప్రతి ఒక్కరూ తమ ప్రతి మూమెంట్‌ను ఫోటోలో బంధిస్తారు. ఇప్పుడంటే అత్యాధునిక మొబైల్ ఫోన్లు రావడంతో చాలామంది రకరకాలుగా ఫోటోలు తీస్తున్నారు. పైగా క్వాలిటీ కూడా బాగా వస్తోంది. అయితే పూర్వం మనకు రీల్ కెమెరాలు మాత్రమే ఉండేవి. రీల్ కెమెరాలకు చెందిన ఫోటోలు తొందరగా పాడయ్యేవి. ఆల్బమ్ జాగ్రత్తగా ఉంచుకుంటే పర్లేదు కానీ విడిగా పెట్టిన ఫోటోలు కలర్ షేడ్ కావడం, కొన్ని ఫోటోలపై మచ్చలు పడటం లాంటివి చోటు చేసుకునేవి.
చిన్నతనంలో మనం తీసుకున్న ఫోటోలలో ఏవైనా షేడ్ మారినవి, మరకలు పడిన ఫోటోలను ఇప్పుడు చూసుకుని అయ్యో అనుకుంటాం. ఇప్పుడు మీరు అలా చింతించాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఫోటో అయినా మళ్లీ రీస్టోర్ చేసుకునే సౌలభ్యాన్ని ఫోటో డాక్టర్ తీసుకువచ్చాడు. ఎవరీ ఫోటో డాక్టర్ అనుకుంటున్నారా? ఫేస్బుక్లో ఓ ఫోటో లవర్ క్రియేట్ చేసిన పేజీ అన్నమాట. ఈ పేజీని మీరు లైక్ చేసి అందులో మీ పాత ఫోటోను వారిని సంప్రదించి పంపిస్తే స్వల్ప ధరలో కొత్త ఫోటోలా చేసి ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఫేస్బుక్ ఓపెన్ చేసి https://www.facebook.com/yourphotodoctor/ ఈ లింకును క్లిక్ చేయండి.