Breaking News

జాతీయ జెండాను రామ్‌చరణ్ అవమానించాడంటూ నెటిజన్‌ల ఫైర్

2 0

స్వాతంత్ర్య దినోత్సవం రోజు హీరో రామ్‌చరణ్‌పై నెటిజన్‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి కారణం అతడి‘హ్యాపీ మొబైల్స్’ ప్రకటన. ఈ సంస్థకు హీరో రామ్‌చరణ్ కొన్నేళ్లుగా కొంత రెమ్యునరేషన్ తీసుకుని ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ రోజు ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆ సంస్థ చ‌ర‌ణ్ ఫొటోతో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది. ఈ ప్రకటనలో చ‌ర‌ణ్ జాతీయ జెండా ఎగర వేస్తున్నట్లుగా ఫోటో ఉంది. జాతీయ జెండాలో అశోక చ‌క్రం లేక‌పోవ‌డంతో నెటిజ‌న్స్.. సంస్థ‌తో పాటు చ‌ర‌ణ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే ఈ విమర్శలపై హ్యాపీ మొబైల్ సంస్థ స్పందించింది. ‘వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడటం అనేది నేరం… ప్రకటనలు ఇచ్చుకునేటప్పుడు జాతీయ జెండాను పోలి ఉండేలా త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలి. అందుకునే అశోక చక్రం లేకుండా ఉండే త్రివర్ణ ప‌తాకాన్ని వాడాం’ అంటూ వివ‌ర‌ణ ఇచ్చింది‌. దీంతో నెటిజ‌న్‌లకు ఓ క్లారిటీ వ‌చ్చింది. అయితే 2002 జాతీయ జెండా చట్టం ప్రకారం ఇలా అశోక చక్రం లేకుండా జెండా ఉండడం అనేది తీవ్ర నేరం.