దేశవాళీ క్రికెట్‌లో భారత స్టార్ ప్లేయర్ ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ జట్టుతో పాటు డెమెస్టిక్ క్రికెట్ ఆడిన ఉన్ముక్త్.. 2012లో అండర్ 19 జట్టుకు ఉన్ముక్త్ చంద్ వరల్డ్ కప్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ ఏడాది ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 19 ఏళ్లకే అతడు సెలబ్రెటీ అయిపోయాడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ అవుతాడని, భారత సీనియర్ జట్టును నడిపిస్తాడని నాడు క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు. కానీ, అవేవీ జరగలేదు.
2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత ప్రాబబుల్స్ జాబితాలో స్థానం లభించినా, తుదిజట్లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. మొత్తం 59 T20 మ్యాచులు ఆడిన అతడు, 1188 పరుగులు చేయగా.. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ అనంతరం అతడు అమెరికా తరఫున ఆడనున్నాడు.