Breaking News

దుమ్మురేపుతున్న మహేష్ బ్లాస్టర్ టీజర్

1 0

సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సర్కారువారిపాట మూవీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 13 గంటల్లో 7 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ వీడియోకు 5.10 లక్షల లైకులు కూడా వచ్చినట్లు పేర్కొంది.

మరోవైపు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం అర్థరాత్రి ‘సర్కారు వారి పాట’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించాడని టీజర్ చూసిన అభిమానులు సంబరపడుతున్నారు. టీజర్ ఎంట్రీలో ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అతడి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇఫ్ యూ మిస్ ద ఇంట్రెస్ట్.. యు విల్ గెట్ యువర్ డేట్ అంటూ విలన్‌కు మహేష్ సింపుల వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా ఈ మూవీలో కీర్తి సురేష్ కూడా ఎంతో అందంగా కనిపించింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది.