Breaking News

RRR మూవీలో ఎన్టీఆర్‌కు గాయం

1 0

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘RRR’ మూవీ విడుదలకు టైం దగ్గర పడుతోంది. మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌పై జక్కన్న దృష్టిపెట్టాడు. ఈ నేపథ్యంలో చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే సదరు వీడియోలో ఎన్టీఆర్‌ మొహంపై గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘RRR’ మూవీ టీమ్‌ ఉక్రెయిన్‌లో ఉంది.