Breaking News

RRR అప్‌డేట్ వచ్చేసింది

1 0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘RRR’. ఈ మూవీ నుంచి మంగళవారం ఓ అప్‌డేట్ విడుదలైంది. ఈ మూవీలోని తొలి పాటను ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఐదు భాషల్లో ఈ పాట ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ‘దోస్తీ’ పేరుతో ఈ సాంగ్ సాగనున్నట్లు యూనిట్ పేర్కొంది. తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర ఆలపించాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.