Breaking News

దుమ్మురేపుతున్న ‘రోర్ ఆఫ్ RRR’ వీడియో

1 0

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘RRR’ మూవీ మేకింగ్ వీడియోను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. భారీ స్థాయిలో షూటింగ్ జరుగుతున్నట్లు ఈ మేకింగ్ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం 48 సెకన్ల పాటు సాగిన ఈ వీడియోలో సినిమాను ఎంత పకడ్బందీగా, సాహసోపేతంగా చిత్రీకరిస్తున్నారో వివరించారు. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీంగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ముందుగా ప్రకటించిన మేరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.