Breaking News

ఈ కరోనా టీకా తీసుకుంటే నరాల వ్యాధి వస్తుందట

1 0

కరోనా టీకా తీసుకునే వారికి అమెరికాకు చెందిన ఆహార‌, ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు జారీ చేసింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకా తీసుకున్న‌వారిలో నరాల స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా జే అండ్ జే వ్యాక్సిన్ తీసుకుంటే గుయిల్లెయిన్ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అయ్యే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొన్న‌ది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాకు ఎమ‌ర్జెన్సీ అనుమ‌తి ద‌క్కినా అమెరికాలో ఈ టీకాను పెద్ద‌గా వాడ‌లేదు. కానీ జీబీఎస్ ల‌క్ష‌ణాలు ఉన్న 100 కేసుల‌ను గుర్తించిన‌ట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు.

ఇప్పటివరకు అమెరికాలో సుమారు 1.2 కోట్ల మందికి జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాల‌ను వేశారు. ఓ సర్వే ప్రకారం 95 మంది తీవ్ర‌మైన జీబీఎస్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రి పాల‌య్యారు. అందులో ఒకరు చనిపోయినట్లు సమాచారం. జీబీఎస్ వ్యాధి ద్వారా శ‌రీరంలోని రోగ నిరోధ‌క శ‌క్తి దెబ్బ‌తిని నాడీ క‌ణాలు కుప్ప‌కూలిపోతాయి. ఈ కారణంగా కండ‌రాలు బ‌ల‌హీన‌మ‌వుతాయి. పరిస్థితి విషమిస్తే ప‌క్ష‌వాతం వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. టీకా తీసుకున్న 42 రోజుల త‌ర్వాత ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని, కానీ ఈ కేసులు అత్యంత అరుదు అని స‌ర్వే రిపోర్టులో స్పష్టమైంది.