ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మగవాళ్లు తమ ఉద్యోగాల కోసం నైట్ షిఫ్టులు చేస్తున్నారు. దీంతో వాళ్లకు సరైన నిద్ర ఉండటం లేదు. ఈ కారణంగా కొందరు మగవాళ్లు సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఓ ఐదు ఆహార పదార్థాలు మగవాళ్లు అస్సలు తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తీసుకోవడం స్మెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని వారు చెప్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
★ సోయా ఉత్పత్తులకు పురుషులు దూరంగా ఉండాలి. ఎందుకంటే సోయా ఉత్పత్తుల్లో ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడంతో పాటు పురుషుల స్మెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
★ ట్రాన్స్ ఫ్యాక్ట్స్ ఉండే ఆహారాలు తినకూడదు. అంటే ముఖ్యంగా వేపుళ్లు, ప్యాక్ చేసిన ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల వీర్యకణాలు దెబ్బతినడంతో పాటు మహిళల్లోనూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
★ పురుగులమందు చల్లిన పండ్లను మరియు కూరగాయలను తినకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రసాయనాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి
★ అధిక కొవ్వులు ఉండే పాల పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి వీర్యంలోని చలన శీలతను తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు. పశువులకు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇచ్చిన సందర్భంగా ఆయా పశువులు ఇచ్చే పాలలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు చేరతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు