Breaking News

వెంకటేష్ ‘నారప్ప’.. ఓటీటీ డేట్ వచ్చేసింది

3 0

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డ నేపథ్యంలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ సినిమాను అనుకున్న విధంగానే అమెజాన్ ప్రైమ్‌లో నిర్మాత విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. అయితే తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ లాస్ట్ వరకు ఓటీటీలో విడుదల చేయవద్దని చెప్పినా నారప్ప సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాత సురేష్ బాబు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది టాలీవుడ్‌కు సంబంధించి ఓటీటీలో విడుదల కాబోతున్న భారీ చిత్రం ‘నారప్ప’ కావడం విశేషం.