Breaking News

RRR కొత్త పోస్టర్.. ‘కార్తీక దీపం’ వెర్షన్‌లో

1 0

RRR మూవీ కొత్త పోస్టర్‌ను ఎవరికి నచ్చినట్టు వారు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఈ పోస్టర్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించగా.. ఇక సన్ రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా RRR ఫోటోలో కేన్ విలియమ్సన్‌తో తన ఫోటోను పెట్టి నెటిజన్ల మనసు దోచుకున్నాడు. అయితే తాజాగా ‘కార్తీక దీపం’ సీరియల్ నటీనటులతో కూడిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

డాక్టర్ బాబు బుల్లెట్ తోలుతుంటే.. వెనుక దీపతోపాటు మోనిత కూడా కూర్చుని ఉన్నట్టుగా మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఈ ఫన్నీ మీమ్‌పై డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల) రియాక్ట్ అవుతూ.. దాన్ని తన ఫేస్ బుక్ స్టోరీలో పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇలాంటి పోస్టర్‌ని ఎలా చేసార్రా బాబూ.. నాకు ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు’ అని కామెంట్ చేస్తూ తల బాదుకుని.. నోటికి ప్లాస్టర్ వేసుకుని ఉన్న ఎమోజీని నిరుపమ్ పరిటాల షేర్ చేశాడు.