Breaking News

బండికి సర్వీసింగ్ చేయిస్తారు.. మరి గుండెను సర్వీసింగ్ చేయాలంటే?

1 0

రోజూ ఓ రెండు, మూడు గంటలు వాడుకునే మన బైకును.. వాడకుండా ఓ 30 రోజులు మూల పెడితే అది తుప్పు ఎక్కిపోయి పనికిరాకుండా పోతుంది. దీంతో బండిని సర్వీసింగ్ చేయించి వాడుతుంటాం. మరి నిరంతరం పనిచేసే మన గుండెను సర్వీసింగ్ చేయించాలంటే ఏం చేయాలి? గుండెలో కొవ్వు ఎక్కువ చేరితే పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో గుండె సర్వీసింగ్ గురించి ఓ వ్యక్తి సలహాలు చెప్పే వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

కొలెస్టరాల్ ఎక్కువగా ఉన్నవారు తొలుత చేయాల్సిన పని మాంసం తినడం బంద్ చేయాలి. వారు చికెన్, మటన్ లాంటివి కాకుండా చేపలు ఎక్కువగా తినాలి. కోడిగుడ్డులో పచ్చసొన కాకుండా వైట్ మాత్రమే తినాలి. అటు వెజిటేరియన్లు అయితే ప్రతిరోజూ బ్రష్ చేసిన తర్వాత పరగడుపుతో రెండు తమలపాకులు, మూడు వెలుల్లి రెబ్బలు, అల్లం ముక్క, నాలుగు స్పూన్‌ల తేనె తీసుకుని వీటిని దంచి మిక్స్ చేసుకుని తినాలి. ఓ 30 రోజుల పాటు ఇలా చేస్తే గుండె క్లీన్ అవుతుందని, కొలెస్టరాల్ తగ్గుతుందని వీడియోలోని వ్యక్తి చెప్తున్నాడు. మరి ఇందులో ఎంత నిజముందో వైద్యులే నిర్ధారించాలి.